04-10-2025 05:44:27 PM
బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు
మహబూబాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలుపుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ శ్రేణులంతా తగిన కృషి చేయలని ఆయన కేడర్ కు పిలుపునిచ్చారు. కేసముద్రం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు యు.రమేష్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఐదు దశల్లో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించామని చెప్పారు. గ్రామాలకు కేంద్ర నిధులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందేనన్న నినాదాన్ని ప్రజల్లోకి తిసుకువెళ్లానని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ లకు ప్రత్యామ్నాయ మూడో శక్తిగా బీజేపీ ఎదగాలని శ్రేణులకు దిశ దశ నిర్దేశించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన కేసముద్రం మండల స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారి మేరెడ్డి సురేందర్ మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ శ్రేణులంతా తగిన కృషి చేయలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహరెడ్డి, జిల్లా లీగల్ సెల్ కన్వినర్ తుంపిళ్ళ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి బోనగిరి ఉపేందర్, మండల ఉపాద్యక్షుడు చెలగోల వెంకటేష్, ఉపాద్యక్షురాలు నగరబోయిన చంద్రకళ, జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, జుజ్జురి వీరభద్ర చారి,గాంతి వెంకట్ రెడ్డి, మల్యాల రాములు, మంగి శెట్టి నాగయ్య, కొనకనకటి రవీందర్ రెడ్డి, పూర్ణకంటి భాస్కర్, ఎలబోయిన కరుణాకర్, పరికిపండ్ల అశోక్, పోలేపల్లి సంపత్ రెడ్డి, పాల్తియ సీతారాం, పాల్తియ రాజేందర్, వాంకుడోత్ నరేష్ సింగంశెట్టి మధుకర్, బండి వెంకన్న, బండి శ్రీను, జాటోత్ సురేష్, రమేష్, భూక్య కోటి, బాలాజీ, జాటోత్ నరేష్, భూక్య సుమన్, మంగ వెంకన్న, శ్రీనాథ్, సురేందర్, భూక్య విజయ్, కృష్ణమాచారి, గుగులోత్ జీవన్ పాల్గొన్నారు.