04-10-2025 05:54:34 PM
సిర్గాపూర్/కంగ్టి /కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి తన కార్యాలయంలో శనివారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... దీపావళి పండుగ ఉందని గ్రామాలల్లో పేకాట ఆడిన, ఆడించిన కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట ఆడితే ఆ స్థలం యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. పేకాట వల్ల వచ్చేది ఏమీ ఉండదని, అనవసరంగా జీవితాలు నాశనం(పాడు) చేసుకోవద్దని, తాగుడుకు బానిసై చివరికి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండల పరిధిలల్లో ఎవరైనా పేకాట ఆడితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలను సూచించారు.