calender_icon.png 28 January, 2026 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి వ్యాపరి సిసి కెమెరాలను అమర్చుకోవాలి

28-01-2026 09:44:31 PM

టూ టౌన్ సిఐ ప్రతాప్ 

చుంచుపల్లి,(విజయక్రాంతి): ప్రతి వ్యాపరి సిసి కెమెరాలను అమర్చుకోవాలని తద్వార్వా నేరస్తులను సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడుతుందని టూ టౌన్ సిఐ ప్రతాప్ అన్నారు. బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా హైవేపై ఉన్న వ్యాపారస్తులకి అవగాహన సదస్సు నిర్వహించారు.

కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోగల రామవరం సెంటర్లో హైవే పక్కనే ఉన్న వ్యాపారస్తులకి రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. సమస్యాత్మకమైన  సంఘటనలు, ఏమై నా నేరాలు జరిగినప్పుడు  సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.  ప్రతి వ్యాపారస్తుడు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు.