28-01-2026 09:47:51 PM
మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ లో నామినేషన్ల ప్రక్రియ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి లోటు పాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులకు సంబంధించిన పత్రాలు సరిగా ఉన్నాయా లేవా చూసి అభ్యర్థులకు తెలియపరచాలని అన్నారు.
నామినేషన్ పత్రాలు సమర్పించేటప్పుడు ఏవైనా అభ్యంతరాలు లోటుపాట్లు ఉన్న విషయాలను అధికారులు అడిగి తెలుసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మొదటి నామినేషన్ కేంద్రం రెవిన్యూ సెక్షన్లో పరిశీలించారు. ఒకటవ వార్డు నుంచి 15వ వార్డు వరకు రెవిన్యూ సెక్షన్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. రెండవ నామినేషన్ కేంద్రం కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేయగా అక్కడ 15 నుంచి 45వాళ్ల సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మూడవ నామినేషన్ కేంద్రాన్ని అకౌంట్స్ సెక్షన్లో ఏర్పాటుచేసి అక్కడ 46 నుండి 49 వార్డుల నామినేషన్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు డిజిటల్ వాచ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును పగడ్బందీగా ఏర్పాటు చేసినట్లు పరిశీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రూ విక్టర్, మధుమోహన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఆడియో వీణ, తాసిల్దార్ జనార్ధన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.