28-01-2026 09:41:29 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఇద్దరు ఏనుగు వర్గంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ అభ్యర్థి మాసాని శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు మోచి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 14వ వార్డులో ఏనుగు వర్గంకు చెందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొత్తకొండ నందిని భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు.