calender_icon.png 6 May, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లోకి ఇంటికో వారసున్ని సైనికుడిలా పంపాలి..

06-05-2025 07:26:35 PM

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి..

టీపీసీసీ పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందని టీపీసీసీ రాష్ట్ర పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి(TPCC State Observer Janga Raghava Reddy) అన్నారు. బెల్లంపల్లి సోమగూడెం టోల్గేట్ దగ్గర త్రినేత్ర ఫంక్షన్ హాల్లో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జంగా రాఘవరెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంటికో వారసున్ని కాంగ్రెస్ లోకి సైనికులా పంపించాలనీ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి పార్టీకి సేవ చేసిన వారికి మాత్రమే పదవులు దక్కుతాయని తేల్చి చెప్పారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ రాహుల్ గాంధీ ఎఐసిసి అగ్రనేతలు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రతి రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జాతీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా అడుగులకి అడ్డుపడాలన్నారు.

ఈ ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి గడపగడపకు తెలియజేయడం ప్రధాన ఉద్దేశం అన్నారు. రాజ్యాంగం ద్వారా మనం పొందుతున్న హక్కులను సమాజంలో ప్రతి గడపగడపకు తెలియజేయాలన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన త్యాగాలతో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిందని వివరించారు. స్వేచ్ఛగా ప్రజలు బ్రతకడానికి గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్రను మర్చిపోవద్దన్నారు. ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చింది, నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోవద్దన్నారు.

ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ గ్రంథాలయ చైర్మన్ తొoగల మల్లేష్, ఏఎంసి చైర్మన్ చింతం స్వామి టిపిసిసి మెంబర్ సిహెచ్ శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేరం రజిత, టిపిసిపి సెక్రెటరీ నూకల రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు.