calender_icon.png 7 May, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

06-05-2025 07:34:39 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులను సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు చేరాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. మంగళవారం బెల్లంపల్లి క్యాంప్ ఆఫీసులో డిగ్రీ అడ్మిషన్ పోస్టర్ ను కళాశాల ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ తో కలిసి ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీలో చేరాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. అన్ని హంగులతో కొనసాగుతున్న బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరంలో నూతన కోర్సులు ప్రారంభమయ్యాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కోరారు.

అర్హత, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్నారన్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు దోస్త్ వెబ్సైట్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను అందజేస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, బి జెడ్ సి కోర్సులతో పాటు ఈ ఏడాది కొత్తగా బీకాం "బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్", బీకాం టాక్సేషన్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ కళాశాలలో అందిస్తున్న వివిధ కోర్సులు డిగ్రీ పూర్తి కాగానే ఉపాధి మార్గాలను చేరువ చేస్తాయని వివరించారు. ఈ  కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బొంకురి ప్రవీణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు గజెల్లి మోహన్, డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్, డాక్టర్ కంబాల మురళీకృష్ణ, అధ్యాపకురాలు కూనురాజుల సమ్మక్క పాల్గొన్నారు.