calender_icon.png 7 May, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

06-05-2025 07:19:14 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో తాము పాల్గొంటామని మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కంబాలపల్లి ఆశా వర్కర్లు వైద్యాధికారి డాక్టర్ సాగర్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు మాధ కరుణ, సిఐటియు పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతుందని ఆరోపించారు. ఆశా వర్కర్లు ప్రభుత్వాల దయాదాక్షిన్యాలపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్మిక చట్టం పరిధిలో ఆశ వర్కర్లను తీసుకురావాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తారీకు జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరిత, లక్ష్మీ, సావిత్రి, సునీత, రమ్య, రమ, జ్యోతి, గీత, సావిత్రి, సుభద్ర, సుకన్య తదితరులు పాల్గొన్నారు.