12 June, 2026 | 1:22 AM

డీడీవో కోడ్‌లు కేటాయించాలి

12-06-2026 12:05 AM

ప్రభుత్వానికి టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ప్రత్యేక డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్ కోడ్లు (డీడీవో) కేటాయించాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ టీచర్ ఫెడరేషన్ (టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో ఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య తెలిపారు.

రాష్ట్రంలోని మోడ ల్ స్కూల్స్ విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రత్యేక డీడీవో కోడ్లు లేకపోవడంతో పరిపాలనా, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కోడ్లను కేటాయిం చడం ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు, బిల్లుల చెల్లింపులు, ఇతర పరిపాలనా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.