calender_icon.png 19 January, 2026 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసల్ ఉన్నోళ్లకే టికెట్!

19-01-2026 12:35:13 AM

రిజర్వేషన్ల ఖరారుతో.. కత్తి మీద సాములా అభ్యర్థుల ఎంపిక 

మున్సిపాలిటీ పీఠాలపై ప్రధాన పార్టీల కన్ను

బీజేపీ, కాంగ్రెస్‌లో కౌన్సిలర్ల కోసం తీవ్ర పోటీ

సెట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం

మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికీ ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తికాగా శనివారం మున్సిపాలిటీ చైర్మన్ చైర్మన్‌తో పాటు వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 20 తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజకీయ పార్టీలో కాక రేపుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మక మారడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాము లాగానే తయారైంది. దీంతో ఈసారి కూడా సామాజిక వర్గం అనేది పక్కనపెట్టి ఆర్థింగా ఎవరు బలంగా ఉంటే వారికి టికెట్ ? అని పైసలు ఉన్నోళ్లకే టికెట్ పక్కా.. అనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

నిర్మల్, జనవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉన్న నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు నాలుగు పార్టీలు ప్రధానంగా పోటీ పనులున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలతో పాటు ఎంఐఎం పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీనికితోడు కమ్యూనిస్టులు, పవన్‌కళ్యాణ్ నేతృతంలోని జనసేన పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల బరి లో ఉంటామని స్పష్టంగా చెప్పడంతో నిర్మల్ జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ పీఠం జనరల్ మహిళలకు కేటాయించగా ఖానాపూర్, బైంసా, మున్సిపాలిటీలను జనరల్‌కు కేటాయించారు. అయితే ఈ రిజర్వేషన్ విషయం లో కొన్ని వార్డులో కొందరికి కలసిరాగా మరికొందరికి కలసి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు

పార్టీలకు ప్రతిష్టాత్మకం..

నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీ లు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న నిర్మల్ మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా రు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి నియోజకవర్గ ఇన్చార్జి సిఆర్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, బీఆర్‌ఎస్ నుంచి జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్‌రెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గుండారము ప్రాతినిథ్యం వహిస్తున్నారు . ఎంఐఎం పార్టీ నుంచి మాజీ మున్సిపల్ చైర్మ న్ అజీమ్ బిన్ అయ్యా, టిడిపి నుంచి ఆ  జిల్లా అధ్యక్షులు రమేష్ తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గ విష యానికొస్తే అక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు నడుమ బొజ్జు పటేల్, బీఆర్‌ఎస్ నియోజకవర్గం జాన్సన్ నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ ప్రాతినిథ్యం  వహిస్తుండగా ఈ ముగ్గురికి ఎన్నిక ప్రతిష్టాత్మక కానుంది.

ఇక ముధోల్ నియోజకవర్గం లో బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు జాబీర్ అహ్మద్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ బిజెపి సెట్టింగ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ టిఆర్‌ఎస్ రమాదేవి విలాస్ గా దేవర్ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ గుర్తులతో ఈ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందని చర్చ జరుగుతుంది ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు సత్తా చాటితేనే ఆ పార్టీ అధిష్టానం వద్ద వారికి కొంత పేరు వస్తుందని ఓడిపోతే పరిస్థితి తారుమారు అవుతుందని ఆయా పార్టీల నేతలు అంతర్మంత్రం చేసుకొని గెలుపు ల కోసం వివరాలు పన్నుతున్నారు. 

ప్రస్తుత రాజకీయ సమీకరణలు చూస్తుంటే మూడు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ బిజెపి, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పోరు తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వామప క్షాలు, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ పార్టీ బలమున్నచోట తమ అభ్యర్థులను కౌన్సిలర్గా నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నా రు. మున్సిపాలిటీలో చైర్మన్‌తో పాటు మెజార్టీ కౌన్సిలర్ల స్థానాలను దక్కించుకోవడానికి పార్టీల అగ్రనేతలు క్రింది స్థాయి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

పోటాపోటీగా దరఖాస్తులు..

తెలంగాణ రాష్ట్రంలోని విభిన్న రాజకీయ పరిస్థితులు నిర్మల్ జిల్లాలో కనిపి స్తున్నాయి. అన్ని పార్టీల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు నేతలు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్,  ఎంఐఎం పార్టీలో ఒక్కొక్క వార్డులో నలుగు రు అభ్యర్థులు పోటీలో నిలవడంతో బలమైన అభ్యర్థులు ఎవరన్నా అంశంపై పార్టీ నేతలు ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా తెచ్చుకుంటున్నారు. ము ఖ్యంగా ముథోల్, నిర్మల్ ఖానాపూర్‌లో కాంగ్రెస్, బిజెపిలో పోటీ తీవ్రంగా ఉన్న ట్టు ప్రచారం జరుగుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ తేలిపోవడంతో ఆయా వార్డులో రిజర్వేషన్ కేటగిరీలో ఏ అభ్యర్థి బలంగా ఉన్నారు పార్టీ నేతలు వారిపై దృష్టి పెట్టారు.

అయితే కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు బలంగా ఉండడంతో ఒక వర్గంకు టికెట్ ఇస్తే మరో వర్గం వారు దూరమయ్యే అవకాశం ఉం ది. దాన్ని సర్దుబాటు చేసేందుకు అగ్రనేతలు ముఖ్యమైన నాయకులతో సంప్ర దింపు జరిపి ఆ వార్డుల్లో ఆర్థికంగా ఎవ రు బలంగా ఉంటే వారికి టికెట్ ఇచ్చి మిగతా వారిని తప్పించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బైంసాలో ఎంఐ ఎం పార్టీలో కూడా ఇది పోటీ ఉండగా ఎంఐఎం టికెట్ ఆశించి దక్కని వారికి బీఆర్‌ఎస్ గాలం వేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అక్కడ టికెట్ రాకపో తే జనసేన పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఉత్సవాలు చూపెడుతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది.