calender_icon.png 16 October, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించుకోవాలి

16-10-2025 06:04:23 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాని స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్  కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమాల పట్ల ఇంటరాక్టివ్ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ప్రజలు తన స్వార్ధంతో సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారని, నేడు యువతలో శాస్త్రీయ ఆలోచన విధానం కొరవడిందని తెలిపారు.

స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆలోచనతో చేపడుతున్న 10 అంశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం సంస్కృతి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ సామాజిక శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంస్థలతో ఎన్ఎస్ఎస్ కలసి పని చేయడానికి సిద్దంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ సభ్యులు పరుశురాం, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.