calender_icon.png 17 October, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

16-10-2025 05:52:32 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి జూలూరు యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసిఫాబాద్(బాలురు), రెబ్బెన(బాలికలు), సిర్పూర్ టి (బాలికలు), కాగజ్ నగర్ (బాలికలు) లలో గల పాఠశాలలలో 6, 7, 8, 9 తరగతులలో మిగిలి ఉన్న ఖాళీలను బి ఎల్ వి సెట్ ఎంట్రన్స్ 2025 రాసి మెరిట్ జాబితాలో ఉన్న జిల్లాకు చెందిన విద్యార్థులతో భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.

అడ్మిషన్ పొందగోరు అభ్యర్థులు బి ఎల్ వి సెట్ ఎంట్రన్స్ 2025 పరీక్ష రాసిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోగా జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రతిభ ఆధారంగా ఉంటుందని, షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, బి ఎల్ వి సెట్ అభ్యర్థులు లేనియెడల మిగతా విద్యార్థులకు లాటరీ పద్ధతిన సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలలో 6వ తరగతిలో 12, 7వ తరగతిలో 13, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో 25 సీట్ల ఖాళీలకు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయని తెలిపారు.