calender_icon.png 8 January, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి

05-01-2026 12:00:00 AM

సీఐ సత్యనారాయణ

మేడ్చల్ అర్బన్, జనవరి 4(విజయ క్రాంతి): శ్రీరంగవరం గ్రామంలో గత అయిదు సంవత్సరాలనుండి నిర్వహిస్తున్న శ్రీరంగవరం ప్రీమియర్ లీగ్ పేరుతో సీజన్ 5 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరిగింది. ఫైనల్ లో రైసింగ్ బుల్స్ విన్నర్ గా వరం వారియర్స్ రన్నర్ గా నిలిచింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మేడ్చల్ సిఐ సత్యనారా యణ మాట్లాడుతూ యువత చెడు అల వాట్లకు బానిసలుగా మారకుండా ఉండా లని, వివిధ క్రీడలలో పాల్గొని శరీర దారు డ్యం పెంచుకుని పోలీస్ ఉద్యోగాలు తెచ్చు కోవాలని గ్రామంలో ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లు పోచయ్య ముదిరాజ్, సురేందర్, మాజీ వార్డు సభ్యులు జిన్నారం కృష్ణ, మాజీ పిఏసిఎస్ డైరెక్టర్ లు మేకల దేవేందర్ రెడ్డి, జీడిపల్లి భూపాల్, ఎంఆర్పి ఎస్ నాయకులు మరిగ్గాని నర్సింహా, శీలం నరేష్ ముదిరాజ్, సద్ది కొండల్ రెడ్డి, పోలీస్ రమేష్, డీజే భానుచందర్, సిఆర్పిఎఫ్ శ్రీనివాస్, ఫిషరీస్ చైర్మన్ తరుణ్ తేజ, తలారి ప్రవీణ్,  తలారి శ్రీనివాస్, సాయిబాబా, నాగారం కుమార్,  సత్యనారా యణ, ఎన్ సి సురేందర్ రెడ్డి  పాల్గొన్నారు.