calender_icon.png 7 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని వినతి

05-01-2026 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ జనవరి 4 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబోలారం తండాలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని తాండ యువకులు మాలోత్ నరేందర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో సుమారు 150 మంది పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపి దృష్టికి తీసుకెళ్లినట్లు నరేందర్ వెల్లడించారు.

రాజబొల్లారం తండాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదని పాఠశాలలో తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపి ఈటెలను తండా యువకులు విజ్ఞప్తి చేశారు. భూక్య గోపి.రమావత్ చందర్.మాలోత్ సురేష్. భూక్య వేణు, రోహిత్ రాజ్.రోహన్ రాజ్, రమావత్ సక్కురాం, భూక్య సంతోష్. భూక్య మనోహర్.భూక్య అశోక్.గుగులోత్ దుర్గా తదితరులు పాల్గొన్నారు.