05-01-2026 12:00:00 AM
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
వనపర్తి, జనవరి 4 (విజయక్రాంతి ): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఒక్క సైన్స్ వల్లనే సాధ్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్ లో రాములు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన రామన్ ఐఐటి టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిధిగా హజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలంలో నదుల పక్కనే నాగరికత మొదలైదని నది పక్కల వ్యవసాయం చేస్తూ నాగరికత వైపు అడుగులు వేశామని అన్నారు. నిప్పు పుట్టించి వంట వండుకొని తినడం క్రమంగా ఇనుము ద్వారా ఆయుధాలను తయారు చేసుకోవడం జరిగిందన్నారు.
సైన్స్ ద్వారా మానవుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారని ఆది మానవుని నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు సైన్స్ అభివృద్ధి కారణమన్నారు. విద్యలో పిల్లలకు నైతిక విలువలతో కూడిన విద్య చాలా అవసరమని, విద్యను నిర్లక్ష్యం చేయకుండా ఆకాశమే హద్దుగా చదివి ఉన్నతంగా ఎదిగి పుట్టిన నేలకు సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు మొదటగా అమ్మ నాన్న లను గౌరవించాలని తర్వాత గురువును గౌరవించాలని, తల్లిదండ్రులు పిల్లలకు పురాణాలను ఎక్కువగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, మాజీ జెడ్పి చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.