calender_icon.png 30 July, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది

30-07-2025 12:05:19 AM

- జిల్లాలో ‘ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్‘ శిక్షణకు ఎంపిక పూర్తయిన మొదటి బ్యాచ్ 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 29, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగ వచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నా రు. మంగళవారం పాల్వంచలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్‘ కో ర్సుపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘కంప్యూటర్ ప్రోగ్రామ్ చేయగలదు కానీ ఫర్నిచర్ తయారు చేయలేదు.

ఈ వృత్తుల్లో స్థిరత, ఆదాయం రెండూ ఉం టాయి‘ అని పేర్కొన్నారు.ఈ శిక్షణ పూర్తి అ యిన అనంతరం నెలకు రూ.15,000 నుం డి రూ.30,000 వరకు పారితోషికంతో ఉ ద్యోగ అవకాశాలు ఉండగా, కొందరికి రూ.1 లక్ష వరకు వేతనాలు పొందే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువత వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ అవగాహ న కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్ ఎస్ టి ఐ, ఎఫ్ ఎఫ్ ఎస్ సి హై దరాబాద్ సంయుక్తంగా నిర్వహించాయి.

ఫ ర్నిచర్ అండ్ ఫిటింగ్స్ స్కిల్ కౌన్సిల్ (FFSC) రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ప్రశాంత్ పీ. ఆధ్వర్యంలో శిక్షణా అవకాశాల గురించి సమగ్రంగా వివరించారు. డ్రాయింగ్ & టెస్ట్ ద్వారా ఎంపిక మొదటి బ్యాచ్కు శుభారంభంఈ కార్యక్రమంలో నిర్వహించిన డ్రా యింగ్ ,టెస్ట్ ద్వారా మొదటి బ్యాచ్గా 10 మంది గిరిజన యువత ఎంపికయ్యారు. వారు ఎన్ ఎస్ టి ఐ హైదరాబాద్లో మూడు నెలల పాటు శిక్షణ పొందనున్నారు.

ఎంపికైన అభ్యర్థుల వివరాలు: 1. డి. రామ్ చరణ్ (బెండలపాడు),. కె. జంపన్న బాబు (బొజ్జిగుప్ప రామచంద్రుని పేట), కె. వెంకటేష్ (బెండలపాడు), కె. అఖిల్ (ఇల్లందులపాడు తండా), డి. అర్జున్ రావు (వడ్డే రంగాపురం), బి. రాజు (మణుగూరు),బి. విష్ణువర్ధన్ (రామవరం),కె. ప్రసాద్ (రామచంద్రుని పేట), కె. రామకృష్ణ (బొజ్జిగుప్ప), ఎస్. వీరేంద్ర గోపాలస్వామి (బెండలపాడు) ప్రతి అభ్యర్థికి జిల్లా యంత్రాంగం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు గా రూ.5,000 చొప్పున అందించనున్నారు. సి ఎస్ ఆర్ ద్వారా వసతి , భోజనం అభిమ న్య ఇంటీరియో డొనేషన్ ప్రవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ వర్మ , ఎంపికైన అభ్యర్థుల కోసం హైదరాబాద్లో మూడు నెలల పాటు వసతి, భోజన ఖర్చుల నిమి త్తం రూ.1,12,200 విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేశారు.

ఈ సాయం సి ఎస్ ఆర్ పథకం ద్వారా చేయబడింది.ఈ సందర్భం గా కలెక్టర్ దిలీప్ వర్మ ను ప్రత్యేకంగా అభినందించారు. ఎఫ్ ఎఫ్ ఎస్ సి రిజలట్స్ స్కి ల్ చాప్టర్స్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పీ. మాట్లాడుతూ, ఫర్నిచర్ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు ఎన్నికైన అభ్యర్థులకు ఆగస్టు 4 తారీకు నుండి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.కార్యక్రమంలో స్కిల్ అకాడమీ అసిస్టెంట్ మేనేజర్ అబ్బోజీ సంతోష్ చారి, మెప్మా పిడి రాజేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు రామడుగు రామాచారి తదితరులు పాల్గొన్నారు.