calender_icon.png 26 October, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి..

26-10-2025 04:49:05 PM

ఎంపీ వంశీకృష్ణ..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సింగరేణి యాజమాన్యం సమిష్టిగా చేపడుతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువకులంతా వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ సూచించారు. ఆదివారం బెల్లంపల్లిలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగులకు సూచనలు చేశారు. నిరుద్యోగులు నిరాశపడకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని కోరారు. సింగరేణి నైపుణ్యాలు పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎనలేని కృషి చేస్తుందనడానికి బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా అనే నిదర్శనం అన్నారు. ఉద్యోగాలు సాధించాలని తపనతో యువత జాబ్ మేళాకు తరలి రావడం అభినందనీయమని కొనియాడారు.