ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
13-05-2024 12:43 AM
యూత్ ఫర్ యాంటీ కరప్షన్
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ పల్నాటి రాజేందర్ నేత పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాల్లో రోజురోజుకు ఓటింగ్ శాతం తగ్గిపోతోందని, ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలింగ్ రోజు ఒక పిక్నిక్ రోజుగా భావించకుండా, ప్రతి ఒక్కరూ ఓటు వేయడమే కాకుండా, చుట్టుపక్కల వారికి కూడా ఓటు వేయాలని అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొన్నె దేవేందర్, కొమటి రమేశ్‌బాబు, మారియా అంతోని, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.




