పోలింగ్‌కు సర్వం సిద్ధం
యువత ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలి
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు యువత తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఆదివారం హైదరాబాద్ నియోజకవర్గంలోని చార్మినార్, యాకుత్‌పుర, గోషామహల్, మలక్ పేట్, కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ల డీఆర్సీ కేంద్రాలను సందర్శించి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు.
పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని 1,944 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నటు చెప్పారు. 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఒక పోలింగ్ కేంద్రానికి రెండు బీయూల చొప్పున 4,862 బ్యాలెట్ యూనిట్లు, 2,427 కంట్రోల్ యూనిట్లు, 2,720 వీవీ ప్యాట్లు అందజేశామని వివరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.




