calender_icon.png 4 December, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రవాణా సదుపాయం కోసం రైల్వే అధికారికి వినతి..

04-12-2025 08:00:54 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాల్ టెక్స్ ఏరియా రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి రవాణా సదుపాయం కల్పించాలని బెల్లంపల్లి కాంగ్రెస్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గోపి కలిసి వినతి పత్రం అందజేశారు. అండర్ బిజి నుంచి బైకులు ఆటోలు వెళ్లేందుకు వీలు కల్పించాలని కోరారు. కాల్ టెక్స్ నుంచి  బైపాస్ రవాణా సదుపాయం లేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రవాణా సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో టీపీసీసీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ 13వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, 12వ వార్డు మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్, 10 వ వార్డు మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఎంఏ సలీo ఉన్నారు.