04-12-2025 08:18:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా సారంగాపూర్ మండలంలోని ప్యారామూర్, మలక్ చించొలి గ్రామాల్లోని దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, మండల అధ్యక్షులు నరేష్ తో పాటు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.