04-12-2025 07:54:17 PM
-ఘనంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
-పోటెత్తిన భక్తజనం
చొప్పదండి (విజయక్రాంతి): కమనీయం.. రమణీయం.. ఆనందమయం.. మనసంతా తన్వితం చెంది అమ్మవారి నామస్మరణతో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయము తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగగా కనువిందులుగా వేద పండితులు పంచంగకర్త జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు నిర్వహించారు. తన శిష్య బృందంతో కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రచారులతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఆలయానికి అశేష భక్తులు తరలివచ్చారు.
ఉదయం 11 గంటల 18 నిమిషాలకు అమ్మవారికి కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన చార్యులు శశికళ దంపతుల ఇంటి నుండి అమ్మవారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను సాంప్రదాయబద్ధంగా ఆలయానికి మేళతాళాల మధ్య తీసుకొని వచ్చారు. అనంతరం కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు సాయంత్రం పుష్పయాగము గ్రామ బలిహరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన చార్యులు శ్రీ భాష్యం నవీనాచార్యులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.