04-12-2025 08:11:36 PM
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): అంగనవాడి కేంద్రంలోని చిన్నారుల భవిష్యత్తు ప్రారంభమవుతుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం దివిటిపల్లి ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ఏకరూప దుస్తులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీలు చిన్నారుల భవిష్యత్ నిర్మాణానికి పునాది అని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు ప్రతి బిడ్డకు సమానంగా చేరేందుకు కట్టుబడి ఉన్నాము.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యలో ఎలాంటి రాజీపడమని స్పష్టం చేశారు. అంగన్వాడీల్లో చిన్నారులకు ప్రొజెక్టర్ ద్వారా కదిలే బొమ్మలతో (యానిమేషన్) పాఠాలు బోధించే విధానం అమలు చేయడానికి చర్యలు ప్రారంభించామని అందులో భాగంగా నగరంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. త్వరలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు జేసీఆర్, కోస్గి శివప్రసాద్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.