04-12-2025 08:15:34 PM
ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి..
నకిరేకల్ (విజయక్రాంతి): కొండ పద్మ మహిళ లోకానికి చేసిన సేవలు మరువలేనివి అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి కొనియాడారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని కమల ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆమె దశదినకర్మకు హాజరై నివాళులర్పిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కొండా యాదగిరి సతీమణి కొండ పద్మ లేని లోటు తీర్చలేనిదని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్నితెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలు సీనియర్ నాయకులు ప్రకాష్ రావు,ఐలు రాష్ట్ర నాయకులు పాల్వంచ జగతయ్య, ఐలూరు జిల్లా నాయకులు ఎండి హఫీస్, న్యాయవాదులు నర్సిరెడ్డి, పులి పాపయ్య, కొమరయ్య, వీరస్వామి, వెంకన్న, సైదులు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.