06-08-2025 12:29:09 AM
సిద్దిపేట, ఆగస్టు 5 (విజయక్రాంతి): విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని గుర్రాలగొంది తాజా మాజీ ఎంపీటీసి ఆకుల హరీష్ అన్నారు. గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యావాలంటీర్ ను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మంగళవారం పాఠశాలలో విద్యా వాలంటర్ కు వేతనం అందజేశారు. ఈ సందర్బంగా ఆకుల హరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తో పాటు , పోటీ పరీక్షల కు సంబంధిచిన మెటీరియల్ ను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం విద్యార్థులు తల్లి తండ్రుల కోరిక మేరకు స్వంత డబ్బులతో ఒక విద్యావాలంటీర్ ను నియమించి ప్రతి నెల 5,000 వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్థులు తమవంతుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.