06-08-2025 12:26:28 AM
పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ సమీపంలో మల్లంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. విద్యుత్ స్తంభం రెండుగా చీలి ఒక పక్కకు ఒరిగింది. దీంతో ఎప్పడు కూలుతుందో.. ఏప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సమీపంలో ఉన్న వాళ్లు...
ఈ రోడ్డు వెంట వెళ్లే వారు ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులు పట్టించుకొని రెండుగా చీలి ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు, పట్టణ వాసులు కోరుతున్నారు.