15-01-2026 01:44:30 AM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓటు వజ్రాయు ధం లాంటిది. అటువంటి ఓటు పై అధికారుల నిర్లక్ష్యం ఓటర్లకు శాపం కాగా పోటీ చేసే ఔత్సాహికులకు చుక్కలు చూపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరపరన్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఓటర్ల జాబితాలు అన్ని మున్సిపాలిటీలో అధికారికంగా వెల్లడించింది నిర్మల్ జిల్లాలో అధికారికంగా ప్రకటించిన ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం నెలకొందని పట్టణ ఓటర్లు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోటీ చేసే లీడర్ల పేర్లు స్థానిక వార్డులో గల్లంతు
విదేశాల్లో ఉన్నవారికి నిర్మల్‌లో ఓట్లు
భార్య, భర్త, కొడుకు, కోడలు నలుగురు నాలుగు వార్డుల్లో విభజన
అభ్యంతరాలు చేసిన మళ్లీ అదే గందరగోళం...
ఎమ్మెల్యే సతీమణి పేరు వేరే వార్డులో..
నిర్మల్, జనవరి ౧4 (విజయక్రాంతి): జిల్లా లో నిర్మల్ భైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ లు ఉండగా మొత్తం ఓటర్లు1 69,285 ఉన్న ట్లు గుర్తించారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 98 204, ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 50, 827 పురుషులు 47 362 ఉన్నారు. బైంసాలో 26 వార్డులు ఉండగా 25 623 మహిళలు 25 484 మంది పురుషులు ఉన్నారు. ఖానాపూర్ లో 12 వార్డులకు గాను 91 69 మహిళలు 88 29 పురుష ఓటర్లు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న కోట్ల డ్రాఫ్టికేషన్ విడుదల చేసి జాబితాలో మార్పులు చేర్పులు చనిపోయిన వారి ఓటర్ల తొలగింపు పోలింగ్ బూతుల జంప్ ఓటర్లు తదితర అంశాలపై అభ్యంతరాలను స్వీకరించారు మూడు జిల్లాల్లో సుమారు 1500 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి సమగ్ర ఓటర్లు జాబితాను ప్రకటిస్తామని తెలిపారు ఇందులో భాగంగా ఈనెల 12న అన్ని మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితాను ఆయా మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో అధికారికంగా ప్రకటించారు
చనిపోయి ఐదేళ్లయిన ఓటర్ జాబితాలో ప్రత్యక్షం
నిర్మల్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలో అధికారికంగా ప్రకటించిన ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం తప్పులు తడకగా ఉందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నా రు. పట్టణంలోని గాజులపేట్, రామ్‌నగర్, చిక్కడపల్లి బుధవార్పేట్ సోఫినగర్ వార్డుల్లో 20 ఏండ్ల క్రితం చనిపోయిన ఓటర్ల పేర్లు పొందుపరిచారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వార్డులో ఉన్న వారి పేర్లను వేరే వార్డులో జం పు చేయించి వాడుతో సంబంధంలేని వారి పేర్లను తమ వార్డులో చేర్చారని ఆధారాలతో మున్సిపల్ కమిషనర్లు నిలదీశారు.
గాజులపేటలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసే అక్రమ్ అలీ పేరు అవార్డులో గల్లత్తయింది. ఆయన 21 వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా పేరు లేకపోవడంతో కంగు తి న్నారు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత సతీమణి ఏలేటి కవితా రెడ్డి 21 నుంచి 35 వార్డుకు మార్చారు. భాగ్యనగర్ వార్డులో హైదరాబాదులో నివాసముంటున్న 20 మంది పేర్లు జాబితాలో చూపించారు. నగేశ్వర్వాడ చెందిన 20 సంవత్సరాల క్రింద విదేశాల్లో స్థిరపడ్డ వారి పేర్లు ప్రస్తుతం ఓటర్ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 21 వార్డులో ఓట్లు వేసినవి ఆ కుటుంబం ఈ ఎన్నికల్లో 24 వార్డుకు బదిలైంచారు.
భాగ్యనగర్ కాలనీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించిన 30 ఓట్లు వేరే వార్డులో రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వార్డుల్లో ఓటర్ జాబితాలో ఓటర్ వ్యక్తిగత ప్రమేయం లేకుండా కొందరు అతని పేరుమీద దరఖాస్తులు ఇచ్చి ఓట్లు రాకుండా కుట్ర లు పన్న విషయం జాబితాలో తేటతెల్లమైంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నిమ్మల లింగారెడ్డి పాతవాడు పద్ధతి కాక కొత్తవాడు 19 లో ఇల్లు కట్టుకొని ఓటు మార్పిడి కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే పాత వార్డులనే ఓటు పొందుపరిచారు.
గాజులపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయ కుడు ఇమ్రాన్ ముళ్ల కుటుంబ సభ్యుల ఓట్లు వేరేవాళ్లు సూచించారు. నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో దిల్వార్పూర్ బోత్ నర్సాపూర్ నేరగొండ నిర్మల్ రూలర్ మండలంలోని ఆయా గ్రామాల ఓటర్లు మున్సిపల్ జాబితాలో పేర్లు ఉన్నట్టు ప్రజాప్రతిని తెలిపారు. మున్సిపల్ ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందిస్తామని అధికారులు అధికారికంగా ప్రకటించిన తుది జాబితాలో అంతా గందరగోళం నెలకొనడంతో గెలుపు ఓటములపై ప్రభావాన్ని చూపనున్నాయి.
న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు...
నిర్మల్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలో అధికారికంగా ప్రకటించిన ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండడం కొన్ని వార్డు ల్లో స్థానికుల పేర్లు గల్లత్తు కావడం ఒక కుటుంబంలో ఉండే కుటుంబ సభ్యులు వెరీ వెరీ వార్డులో ఓట్లు వేసే పరిస్థితి నెలకొనడంతో వారు కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు.ప్రభు త్వం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ప్రజాపతినిధులు తెలుపుతున్న అభ్యంతరాలను పరిశీలించి అవకాశాలు లేకపోవడంతో న్యాయస్థానానికి వెళ్లి స్టే తీసుకొచ్చేందుకు కొందరు తాజా మాజీ కౌన్సిలర్లు ప్రయత్నాలు ప్రారంభించారు.
ముఖ్యంగా ఆయా వార్డులో ప్రజాసేవ చేస్తూ ఈ ఎన్నికల్లో వాడు కౌన్సిలర్ గా పోటీ చేద్దాం అనుకున్న కొందరికి ఆ వార్డు ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం వారికి అనుకూల మైన ఓట్లను వేరే వార్డులో షిఫ్ట్ చేయడంపై వారు మండిపడుతున్నారు.
ఓటరు జాబితాలో తప్పులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన వాటిని సరిదిద్దకపోగా మరింత గందరగో ళం చేశారని దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాల యం ముందు ఆందోళన నిర్వహించారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో అధికారికంగా ప్రకటించిన ఓటరు జాబితాలో కొందరి పేర్లు గలత్తు కావడం చనిపోయిన ఓటర్ల పేర్లు తిరిగి ఓటర్ జాబితాలో ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఓటరు జాబితాలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తుది జాబితా విడుదల చేసినప్పటికీ ఆ జాబితాలో కూడా తప్పులు జరిగినట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం.
జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్
హైదరాబాద్‌లో ఉన్న నిర్మల్ మున్సిపల్ పేర్లు
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్న. తమ వార్డులు తనకు అనుకూలమైన ఓట్లను వేరే వార్డులో షిఫ్ట్ చేశారు తన వాడు ఓటర్ల తప్పులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిష్కరించకపోగా తనకు అనుకూలమైన ఓట్లను వేరే వార్డులో వేయడం వల్ల ఇబ్బంది ఉంది హైదరాబాదులో ఉంటున్న ఓటర్ల పేర్లు కూడా భాగ్యనగర్ కాలనీ ఉన్నట్లు ఓటర్ జాబితాలో చూపించారు.
అడప శ్రీకాంత్, భాగ్యనగర్ కాలనీ
నా వార్డులో పోటీ చేసే అవకాశం లేదు..
నాది పట్టణంలోని 21వ వార్డు. రెండుసార్లు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయా. ఈసారి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న. నా పేరు 31 వ వార్డులో లేదు నేను పోటీ చేయడానికి అవకాశాలు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓటర్లు జాబితా తప్పుల తడకగా రూపొందించారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
అక్రమ్ అలీ, బీఆర్‌ఎస్ నేత