27-10-2025 12:50:59 AM
- మండల విద్యాధికారి సూత్రధారి... పాత్రధారి?
- ప్రైవేటు పాఠశాలల నిర్వహణలో నిబంధనలకు తూట్లు
- ఏళ్ల తరబడి ఆయనే మండల విద్యాధికారి..
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేట్ పాఠశాలల నిర్వహణ అంత అక్రమంగానే సాగుతోందని ఆరోపణలు వెలబ డుతున్నాయి. పాఠశాలల అనుమతినీ మొదలుకొని నిర్వహణ వరకు విద్యాహక్కు చట్టా నికి తూట్లు పొడుస్తున్నట్లు తేటతెల్లమవుతోంది.
ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ ని ర్వహించాల్సిన మండల విద్యాధికారులు వా రిచ్చే కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణ లు వెలబడుతున్నాయి. తాజాగా పాల్వంచ పట్టణ పరిధిలో వెలుగు చూసిన రెండు ప్రై వేటు పాఠశాలల నిర్వహణ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. గత 25 సంవత్సరాలుగా అతనే మండల విద్యాధికారిగా కొనసాగు తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో సక్రమ సంబంధాలను కొనసాగిస్తూ ప్రైవే టు విద్యను బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోం ది. తినేది ప్రభుత్వ సొమ్ము... పాడేది ప్రైవేటు పాట అన్నట్లు ఉంది ఆయన తీరు.
సొసైటీలకే అనుమతులు
విద్యా వ్యాప్తికి ప్రభుత్వం సొసైటీల పేరుతోనే ప్రైవేటు పాఠశాలలకు అనుమతులను మంజూరు చేస్తారు. ఆ పాఠశాలలను సొసై టీ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి కొనసాగిస్తుంటారు. అనివార్య కారణాలవల్ల పాఠశాలలను కొన సాగించలేని పరిస్థితిలో పాఠశాలకు సంబంధించిన రికార్డులను మండల విద్యాధి కార్యాలయానికి సమర్పించడం చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఇత రులకు క్రయవిక్రయాలు చేయడం చట్ట విరుద్ధం.
అలాకాకుండా ఓ ప్రైవేటు సొసైటీ నుంచి మరో ప్రైవేటు సొసైటీ అక్రమ మా ర్గంలో కొనుగోలు చేసి, పాఠశాలల నామకరణాలు మార్చి నిబంధనలకు తూట్లు పొ డిచి విద్యను వ్యాపారంగా మలుచుకుంటూ దండుకుంటున్నారు. ఈ తంతు యావత్తు మండల విద్యాధికారి కనుసన్నాల్లోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంది న కాడికి పుచ్చుకొని మండల విద్యాధికారి గుట్టుచప్పుడు కాకుండా అనుమతులను మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పాల్వం చ పట్టణంలో వెలుగు చూసిన కేఎల్‌ఆర్ టెక్నో పాఠశాలను కొన్ని సంవత్సరాల క్రితం నారాయణ ఇంగ్లీష్ మీడియం యాజమా న్యం కొనుగోలు చేసి పాఠశాల పేరు మా ర్పిడి చేసి, అనుమతులు.. ఒక దగ్గర పొంది మరోచోట పాఠశాల నిర్వహణ చేస్తున్న ని మ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం. తాజాగా ఆదర్శ పాఠశాలను రెండు దఫాలుగా దొడ్డి దారిన ఇతరులు కొనుగోలు చేసి ఏఐఎంఎ స్ పాఠశాలగా పేరు మార్చి, షిఫ్టింగ్ అనుమతులు లేకుండా కొనసాగించడం. ఆయన పై వస్తున్న అవినీతి ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం..
అనుమతులు లేకుండా, అక్రమ మార్గం లో ఇతర పాఠశాలలను కొనుగోలు చేసి విద్యాబోధన చేస్తున్న యాజమాన్యాలు వి ద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో కాకుండా, ఇతర పాఠశాలల పేరుతో టీసీలు, ఇతర సర్టిఫికెట్లు జారీ చేయడం భవిష్యత్తులో వారికి అనేక ఇబ్బందులను తెచ్చి పెట్టడమే అవుతుందని విద్యా వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలతో సక్రమ సంబంధం
పాల్వంచ మండల విద్యాధికారిగా విధు లు నిర్వహిస్తున్న శ్రీరామ్ మూర్తి గత 20 సంవత్సరాలుగా పాల్వంచ మండల విద్యాధికారిగానే కొనసాగుతున్నారు. ఇతర మండ లాలకు బదిలీ అయినప్పటికీ పాల్వంచ మండల విద్యాధికారి పదవిని మాత్రం వదులుకోకపోవడం గమనారహం. చాలా కాలం గా మండల విద్యాధికారిగా విధులు నిర్వహించడం వల్ల ఆ యాజమాన్యాలతో సన్ని హిత సంబంధాలు ఏర్పరచుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్టు తెలుస్తోంది.
ఇన్ని అక్రమాలు వెలుగు చూస్తున్న చర్యలకు ఉపయో గించకపోవడం వాటిని ధ్రువపరుస్తోంది. ఎప్పటికైనా విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రవేట్ పాఠశాల నిర్వహణలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘా లు డిమాండ్ చేస్తున్నాయి.