calender_icon.png 27 October, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంతుళ్లకు ఇదేం పాడు బుద్ధి

27-10-2025 12:34:54 AM

  1. విద్యాసంస్థల్లో  వికృత శ్రేష్టలు

ఏడాదిలో నాలుగు ఘటనలు

పట్టించుకోని జిల్లా యంత్రాంగం

నిర్మల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చిన తల్లి దండ్రుల తర్వాత గురువు స్థానం. పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించవలసిన గురువులే పాఠశాల విద్యార్థులతో వికృతి చేష్టలు చేసి ఆ శాఖకు తీరని మచ్చలు తీసుకొస్తున్నారు.

సంఘటన జరిగినప్పుడు స్పందిస్తున్న జిల్లా యంత్రాం గం ఆ తర్వాత వాటిని నియంత్రణకు కనీస చర్యలు చేపట్టకపోవడంతో నిర్మల్ జిల్లాలో ఇటువంటి ఘటనలు పదే పదే పునావృతం అవుతున్నాయి. దీంతో ఎదిగిన పిల్లలను విద్యాసంస్థల్లో చదివించాలంటేనే విద్యార్థు లు ఒకింత ఆందోళన చెందవలసిన అవస రం ఏర్పడుతుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

నిర్మల్ జిల్లాలోని బాసర జడ్పీహె చ్‌ఎస్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ ముర్తుజా అని అదే పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడం ఆపై కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేయడం జిల్లా విద్యాశాఖలో తీవ్ర చర్చనీయా అంశంగా మారు తుంది.

ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచిన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు తెలిసిన గొప్యంగా ఉంచేందుకు ప్రయత్నించగా అది తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల సిబ్బందిపై దాడి చేసేందుకు వెళ్లగా పోలీసులు చివరి సెలవు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ముర్తుజా అలీ పై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా దీనికి బాధ్యతగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఎంఈఓ మైసజీ పైప్ కూడా కేసు నమోదు చేయడం.

విద్యాశాఖలో కలకలాన్ని సృష్టించిం ది.. పోలీసుల విచారణలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు మైనారి విద్యార్థులే పోలీస్ సిబ్బందికి బహిరంగంగా చెప్పడం పాఠశాలలో లైంగిక వేధిం పులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

ఆరు నెలల క్రితం జిల్లాలోని నర్సాపూర్ జి ఉన్నత పాఠశాలలో ఎస్టీ సామాజిక వర్గం చెందిన ఓ మహిళ బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న మురళీ మనోహర్‌రెడ్డి, మోహన్ రావులు లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఇద్దరినీ ఫోక్సోకు చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటన కూడా పాఠశాల ఉపాధ్యాయులందరి కి తెలిసినప్పటికీ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడం లో గోప్యత ప్రదర్శించిన పాఠశాల పిజిహెచ్‌ఎం పిజిహెచ్‌ఎం కిషన్రావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.

అంతకుముందు సోను మండలంలోని ఓ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 50 సంవత్సరాల ఉన్న ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా దేవి శుద్ధి చేశా రు.  కుబీర్ మండలంలోని పాలసీ గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పిటి అదే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయ్యారు. ఏడాదిలోని నాలుగు ఘటనలు జరగడం విద్యాశా ఖకు తీవ్ర మచ్చగా మారింది. 

పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల పాఠా లు బోధించే ఉపాధ్యాయులు బడి పిల్లలను తమ పిల్లల వల్లే చూసుకోవాల్సి ఉండగా ఆ పిల్లల పైనే లైంగిక వేధింపులు అసభ్య ప్రవర్త న చేయడంపై జిల్లాలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా కడెం ఖానాపూర్ సారంగాపూర్ మండలాల్లో ఇటువంటి ఘటనలు జరిగినప్పటికీ కొన్ని బయ టకు రాగా మరికొన్ని ప్రధానోపాధ్యాయుల జోక్యంతో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి బతిమిలాడించుకుని ఈ ఘటనలు వెలుగులోకి రాకుండా కొందరు ఉపాధ్యాయులు ప్రయత్నించిన ఆరోపణలు విలవిస్తున్నాయి. 

తాజాగా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ బీసీ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థులు ఆరో తరగతి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడం తో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇద్దరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేశా రు. కుంటాల మండల కేంద్రం లో ఓ ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో పనిచేస్తు న్న మహిళా ఉపాధ్యాయురాలతో సంబంధం పెట్టుకోగా పెళ్లి బంధం చెడిపోయే స్థితికి చేరుకుంది.

ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్న వాటి నియంత్రణపై జిల్లా యంత్రాంగం కనీస చర్య లు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు అన్ని శాఖల అధికారులు విచారణ పేరుతో పాఠశాలకు వచ్చి హంగామా సృష్టించి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పం పించడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురిచేస్తుంది

బాధ్యతలు మరుస్తున్న గురువులు..

జిల్లాలో విద్యాసంస్థల పనిచేసే గురువులు ఉద్యోగులు తమ గురుద్వారా బాధితులు మరుస్తూ వ్యాపార వాణిజరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొందరు విద్యాసంస్థకు చెడ్డ పేరు చేస్తున్నారు. విద్యాశాఖలోని లొసుగులను పట్టుకొని సెలవులు ఆరోగ్య సమస్య లు ఇతర అవసరాల పేరుతో పాఠశాలకు డుమ్మా కొట్టి ప్రైవేటు పనులు చేస్తున్నారు.

గత ఏడాది క్రిప్టో కరెన్సీ మోషన్ లో ముగ్గురు ఉపాధ్యాయులుగా చిక్కి సస్పెన్షన్కు గురయ్యారు. మరో 20 మంది ఉపాధ్యాయులు ఇందులో బాధ్యులుగా ఉన్నట్టు తేలినప్పటికీ చివరి నిమిషంలో ఉన్నతాధికారులు జోక్యం తో ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.

క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో తెరవెనుక అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి అండదండలు ఉన్నట్టు కూడా ప్రచారం జరగడంతో జిల్లా విద్యాశాఖను ఈ అంశం కుదిపేసింది. ఇప్పటికీ కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు డుమ్మా కొట్టి ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

నిర్మల్ జిల్లాలో విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భవిష్యత్ తరాలకు బంగారు బాట చూపించే ఉపాధ్యాయులు పిల్లలపైనే కన్ను వేసి నేరాలకు పాల్పడడం జిల్లా విద్యాశాఖ అధికారుల సైతం విస్మయానికి గురిచేస్తుంది. జిల్లాలోని చాలా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య ఐక్యత లోపం ఏర్పడి గ్రూపులుగా విభజించుకుని ఎవరికి వారే యమునా తీరే అనిరీతంగా వివరిస్తూ పాఠశాల విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

సంక్షేమ హాస్టల్లో పని చేస్తే వార్డులు కూడా స్థానికంగా ఉండకపోగా ఇత ర ప్రాంతాల నుంచి రాకపోకలు సాధించడం వల్ల హాస్టల్ విద్యార్థులు పారిపోవడం బీడీ సీక్రెట్ మత్తు పదార్థాలకు కళ్ళుబాటు పడుతున్నట్టు కూడా కొన్ని ఘటనలు ఇటీవలే వెలు గులోకి వచ్చాయి. ఇప్పటికైనా జిల్లా యం త్రాంగం విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు విద్యావేత్తలు కోరుతున్నారు.

పోలీసులు అవగాహన పెంచిన..

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ గత ఏడాది నుంచి పాఠశాలలో వేధింపులు ఇతర సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇప్పటివరకు విద్యార్థులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కోస మెరుపు. విద్యాసంస్థలు ఎదిగిన పిల్లలు ఉండ డం వల్ల సెల్ ఫోన్ల వాడకం ఇతర సామాజిక నెట్వర్క్ వినియోగించడం వల్ల ఉపాధ్యాయు లు విద్యార్థులు కొన్ని పాఠశాలలో పక్కదారి పడుతూ పాడు పనులకు మొగ్గు చూపుతున్నారు.

ఇటువంటి ఘటనలు బయటకు వచ్చి నప్పుడు తీవ్రంగా స్పందించే పోలీసు విద్యాశాఖ ఆ తర్వాత పాఠశాలలో విద్యా సంస్థలు వాటి నియంత్రణపై దృష్టి పెట్టకపోవడం వలన విద్యాసంస్థల్లో వికృతి చేష్టలు విద్యా శాఖకు తీవ్ర మచ్చలు తీసుకొస్తున్నాయి.

పర్యవేక్షణ లోపమే కారణమా?

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలపై సంక్షేమ హాస్టల్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేత లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పీజీ హెచ్‌ఎంలకు మాత్రమే ఎంఈఓ బాధితులను అప్పగించడం వల్ల రెగ్యులర్ ఎంఈవోలు లేకపోవడంతో అన్ని పాఠశాలలో సూపర్వైజర్ చేసే విధానం తక్కువ సమయం ఉంటుంది.

ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలు గ్రూపు లు ఉండడంవల్ల ఏదైనా లోపం ఏర్పడితే దాన్ని ఒక గ్రూప్ వారు బయటకు లీకేజీ ఇవ్వడం ఆ తర్వాత వేరే గ్రూపు వారు వీరి పై అదే స్థాయిలో చర్యలకు ఉపద్రవం ఉపక్రమించుకోవడం పాఠశాల విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతిస్తుంది. సాధారణంగా ప్రతి విద్యాసంస్థలు పురుష ఉపాధ్యాయులతో పాటు మహిళా ఉపాధ్యాయులు కూడా లెక్చరర్లు విధులు నిర్వ హిస్తున్నారు.

మహిళా ఉపాధ్యాయులు ఆ విద్యాసంస్థల్లో చదివే పిల్లల స్థితిగతుపై అంచనా వేస్తూ అనుమానం వస్తే ఆ కారణాలను వెతికి ఆ సమస్య పరిష్కారానికి గుర్తు చేయాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలో ఆడపిల్లలతో సైతం మాట్లాడే పరిస్థితి లేదు. బడికి వచ్చామా పాటలు చెప్పామా సాయంత్రం అయ్యిందా బస్సు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇంటికి చేరుకుంటాం అనే దూరంలో ఉపాధ్యాయు లు వివరిస్తూ విద్యాసంస్థల్లో చదివే పిల్లలపై కొద్దిమాటి శ్రద్ధ కూడా తీసుకోకపోవ డమే కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పతి తరగతిలో ఆ పాఠశాలలో పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ లోపం కార ణమని తెలుస్తోంది. ఉపాధ్యాయుడు తప్పు చేసినప్పుడు దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్న తోటి ఉపాధ్యాయులు ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్టు అనుమానం వస్తే ఆ ఉపాధ్యాయుడు పై ముందే చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునవృతం కావని విద్యావేత్త లు పేర్కొంటున్నారు.

ప్రతి పాఠశాలలో విద్యాసంస్థలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతినెల సమావేశంలో నిర్వహిం చి పాఠశాల స్థితిగతులు విద్యార్థుల ఫలితాలు చదువు విద్యార్థులు ఉపాధ్యాయు ల ప్రవర్తన తీరు తదితర అంశాలపై చర్చించవలసి ఉన్న ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టకపోవడం వలన పాఠశాలల్లో పాడు పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి