calender_icon.png 27 October, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్పిటల్ ఫుల్.. నిబంధనలు నిల్..

27-10-2025 01:06:05 AM

- వినాయక హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ

-  రోడ్లపైన పార్కింగ్ చెయ్యాల్సిన పరిస్థితి

- ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యం

- అడ్డగోలుగా స్కానింగ్ రిఫర్ లతో దోపిడీ

- నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహారిస్తున్న అధికారులు

- చర్యలకు తీసుకోవాలని రోగులు,ప్రజల ఆవేదన

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో హాస్పిటల్లో చూస్తే రోగులతో ‘ఫుల్‘ గానే ఉంటుంది. కానీ నిబంధనలు మాత్రం ‘నిల్‘ గానే కనిపిస్తుంది.ఇదివరకే ఎన్నో పత్రికల్లో హేచ్చరిం చిన తిరుమర్చుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణం లోని వినాయక హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. హాస్పి టల్ కు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ చెయ్యడానికి స్థలం లేకపోవడం తో రోడ్డు పైన నిలుపాల్సిన దుస్థితి ఏర్పడింది.

హాస్పిటల్ నిర్వహణ కు పార్కింగ్ ఉండేలా చర్య లు తీసుకోవాలి. సెల్లార్లకు నోటీసులు ఇచ్చే మున్సిపల్ అధికారులు నిబంధనలను విరుద్ధంగా పార్కింగ్ లేకుండా కొనసాగుతున్న హాస్పిటల్ పైన ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఫైర్ సేఫ్టీ దేవుడు ఎరుగు....ఫైర్ గ్యాస్ ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతే రోగుల ప్రాణాల కు దిక్కెవర్ అంటూ మండిపడుతున్నారు.

రోగులకు స్కానింగ్ లు రిఫర్లు చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్న వైద్యధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూల్స్ పాటించకుండా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యలు ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తున్నారు. రోగుల నుండి లక్షలాది రూపా యలు వసూల్ చేసే యాజమాన్యాలు కనీసపు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చెయ్యకపోవడం దారుణం అంటూన్నారు.

సిరిసిల్ల లో అనేక హాస్పిటల్ రూల్స్ పాటించకుండా వ్యవహారిస్తున్న హాస్పిటల్ యాజ మాన్యలపై చర్యలు తీసుకోకపోవడం లో విఫలం అవుతున్న అధికారులపై మండిపడుతున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి నిబంధనలకు విరుద్ధం గా వ్యవహారిస్తున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు, రోగులు ,కోరుతున్నారు.