calender_icon.png 10 December, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధం..

10-12-2025 05:30:02 PM

పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన  సిబ్బంది..

పోలింగ్ కు పోలింగ్ స్టేషన్లు సిద్ధం..

చిట్యాల (విజయక్రాంతి): గురువారం జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు చిట్యాల మండలంలో ఎన్నికల అధికారులు అన్ని సిద్ధం చేశారు. చిట్యాల మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరగనుండగా అందుకు అవసరమయ్యే ఏర్పాట్లను ఎన్నికల సిబ్బంది సిద్దం చేశారు. మొత్తం 18 గ్రామ పంచాయతీలలో 18 పోలింగ్ స్టేషనులను ఏర్పాటు చేశారు. ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా 180 మంది విధులు నిర్వర్తిస్తుండగా అధర్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ 256 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందిని  స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. వీరు పోలింగ్ నిర్వహణ అనంతరం కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక, తదితర విధులు నిర్వర్తించనున్నారు. అలాగే ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు, 4 జోనల్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 

బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన డిఆర్సిలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని అందజేశారు. గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఎన్నికలు జరగనున్నట్లు ఎంపీడీవో ఎన్నికల అధికారి ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2:00 నుండి ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఆయా వార్డు మెంబర్లతో ఉపసర్పంచ్ కు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏదైనా అనివార్య కారణాల రిత్యా ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడినట్లయితే తిరిగి మరుసటి రోజు ఉదయం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని ఆమె తెలిపారు.