calender_icon.png 10 December, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత డెంటల్ చికిత్స అందించాలి

10-12-2025 05:34:27 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక దంత వైద్య క్యాంపుల ద్వారా దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ దంత వైద్యుల బృందాన్ని ఆదేశించారు.  బుధవారం కరీంనగర్ కళాభారతిలో మున్సిపల్ కార్మికులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక దంత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక క్యాంపుల ద్వారా ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దంత సమస్యలు ఎక్కువగా ఉన్నవారిని వైద్యులు గుర్తించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తదుపరి చికిత్స ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ నవీనా, ప్రభుత్వ దంత వైద్య అధికారులు రవి ప్రవీణ్ రెడ్డి,  రణదీప్, ప్రవీణ్, రాజు, సతీష్ పాల్గొన్నారు.