10-12-2025 05:04:48 PM
సంతాపం తెలిపిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు మేడిపల్లి, కవ్వంపల్లి..
కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ నేత, జిల్లా వక్ఫ్ బోర్డు ప్రొటెక్షన్, డెవెలప్ మెంట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ సమద్ నవాబ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమద్ నవాబ్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరకు ఎదిగారు.
సమద్ నవాబ్ మృతి పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిరాజ్ హుస్సేన్, అబ్దుల్ రెహమాన్, ఇర్ఫాన్ తదితరులతో కలిసి హుస్సేనీపురలోని సమద్ నవాబ్ నివాసంలో పార్థీవదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.