10-12-2025 05:32:13 PM
ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): వ్యాపారస్తులకు, వినియోగదారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ సభ్యులకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష సూచించారు. బుధవారం అసోసియేషన్ సభ్యులు ఆమెను మర్యాదగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ కు చెందిన హోటల్, బేకరి, కిరాణా తదితరుల యజమానులు, వినియోగదారులను చైత్యం చేయాలన్నారు. దీనికి అసోసియేషన్ సభ్యులు స్పందిస్తూ వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అద్యక్షులు దినేష్ మాటోలియా, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, కోశాధికారి మనోహర్, ఉపాధ్యక్షులు తానాజీ, శ్రీనివాస్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.