calender_icon.png 12 July, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ

11-07-2025 09:24:46 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో వాహనాలను స్థానిక ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని, అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డు పై నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాలకు ఉన్న పెండింగ్ చలాన్లు కట్టివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ నాగభిక్షం, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.