11-07-2025 08:40:26 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పర్యటనలో వున్న CWC ప్రత్యేక ఆహ్వానితులు ఖమ్మం జిల్లా ఇంఛార్జి వంశీ చందర్ రెడ్డిని శుక్రవారం ఖమ్మంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ శరాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, నల్లమల వేంకటేశ్వర్లు కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.