calender_icon.png 12 July, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు హర్షనీయం..

11-07-2025 09:12:02 PM

బుడ్డ భాగ్యరాజ్  జిల్లా కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

తూప్రాన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని బుడ్డ భాగ్యరాజ్  జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తూప్రాన్ సమావేశంలో అన్నారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించినది.

విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం చిరస్మరణీయ మన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన "జనాభా ప్రాతి పాదికన రిజర్వేషన్లు పెంచాలి" అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బిసి డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియ జేస్తున్నామన్నారు.