calender_icon.png 12 July, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యజమాన్యం మొండి వైఖరి విరమించుకోవాలి

11-07-2025 09:08:07 PM

మజ్దూర్ సంఘ్ యూనియన్ నాయకులు

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం పరిదిలోని వడియారం గ్రామంలో గల ఏపీఎల్, అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులకు వేతన ఒప్పందంలో కంపెనీ యాజమాన్యం మొండివైఖరి వివరించుకోవాలి అని మజ్దూర్ యూనియన్ నాయకులు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... సంగారెడ్డిలోని లేబర్ కమిషనర్ ముందు ఎన్ని నోటీసులు ఇచ్చిన, కంపెనీ యజమాన్యం, వేతన ఒప్పందం గురించి చర్చకు రాకుండా, గత 15 నెలల నుండి 69 మంది కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇందుకు నిరసనగా గత నాలుగు రోజుల నుండి నల్ల బ్యాచిలు ధరిస్తూ, కంపెనీ గేటు ముందు నినాదాలు చేస్తూన్నా పట్టించుకోవడం లేదన్నారు.

యాజమాన్యం రెండు విధాలుగా అవలంబిస్తుందని యూనియన్ లో ఉన్నవారికి ఒక విధంగా జీతం, యూనియన్ లో లేని వారికి ఒక విధంగా జీతం ఇస్తున్నదన్ని అన్నారు. ఈ కంపెనీ వల్ల చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ పొలాలలో యాసిడ్ వాటర్ వచ్చి పొలాలు చాలా నాశనం అవుతున్నాయి. రైతులు కూడా వచ్చి కంపెనీ యందు చాలాసార్లు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. కానీ వారికి కూడా న్యాయం జరగలేదు. కంపెనీ మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకారం అని అన్నారు.