calender_icon.png 12 July, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో రచ్చపల్లిలో పాడి గేదె మృతి

11-07-2025 08:37:38 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు ఈరామల్ల రాజేశం కి చెందిన పాడి గేదె విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది. గ్రామంలోని సబ్ స్టేషన్ కి చుట్టూ పెన్సింగ్ లేకపోవడంతో పశువులు లోపటికి వెళ్తున్నాయని, రైతులు తెలిపారు. ఈ విషయం ఏఈకి  సబ్ స్టేషన్ సిబ్బందికి ఎన్ని సార్లు తెలిపిన పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సిబ్బందినీ అడుగగా దురుసుగా ప్రవర్తించినరని రైతు రాజేశం కుటుంబ సభ్యులు విలపిస్తూ తెలిపారు.