calender_icon.png 12 July, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి

11-07-2025 07:44:59 PM

మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లంచం అడుగుతున్నట్లు బురదజల్లే ప్రయత్నం చేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓ వ్యక్తి కుట్ర పూరితంగా వీడియోలు తీసి వాటిని విలేకరులకు, సోషల్ మీడియాలో వచ్చేలా ప్రోత్సహించాడన్నారు. 

ఉద్దేశ్యపూర్వకంగా బలరావు పేట్ మాజీ సర్పంచ్ కందుల మోహన్ పై అసత్య ఆరోపణలతో వీడియోలు తీయించి విలేకరులకు పంపినట్లు తెలిసిందన్నారు.వేల్పుల భీమక్క కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు రాలేని పరిస్థితి ఉంటే మానవతా దృక్పధంతో ప్రొసీడింగ్స్ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తప్పుడు వీడియోలు చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తే సహించేది లేదన్నారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. విలేకరుల ముసుగులో కొందరు కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేయండి సరి కాదన్నారు. అంతేకాకుండా మీడియా కూడా బాధితుల నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతనే కథనాలు రాయాలని తొందరపాటు పనికి రాదనీ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.