calender_icon.png 11 July, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాల నుండి తప్పుకుంటా..!

11-07-2025 04:25:31 PM

ప్రజలకు ఇచ్చిన మరో మూడు పథకాలు పెండింగ్లో ఉన్నాయి

అవి పూర్తయిన వెంటనే నిర్ణయం

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ షాకింగ్ కామెంట్స్

 నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన మరో మూడు అభివృద్ధి పథకాలు పూర్తయిన వెంటనే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పాఠ్యపుస్తకాల పంపిణీ  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అమ్రాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టు, రిజర్వాయర్, మద్దిమడుగు మీదుగా మాచర్ల కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం, నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను పొందేందుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఈ ప్రాంత వాసులకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ అవకాశం, నల్లమల అటవీ ప్రాంతంలో కుటీర పరిశ్రమల ఏర్పాటు వంటి సంక్షేమ పథకాలను పూర్తి చేసి అనంతరం రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నెలల తరబడి ఢిల్లీలో ఉండి అయినా ఈ పథకాలను సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం తన ఆరోగ్య రీత్యా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్ర చర్చకు దారితీసింది.