calender_icon.png 13 October, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల తీర్పుపై ఉత్కంఠ!

08-10-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ర్ట ప్రభుత్వం పం పిన బీసీ రిజర్వేషన్ల బిల్లును చట్టం చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెల కొంది. ఓబీసీ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల అమలు కోసం 9వ షెడ్యూల్లో చేర్చకుం డా, ఎలాంటి ఒత్తిడి తేకుండా రోజుకో మా ట చెప్పి బీసీలను దగా చేస్తూ వస్తున్నారు. 50 శాతం సీలింగ్ పేరుతో దశబ్దాలుగా బీ సీ వర్గాలకు అన్యాయమే జరుగుతుంది. కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిష న్, ఎన్సీబీసీ చట్టం బీసీల కన్నీళ్లను తుడ వలేకుండా పోయింది.

తాను బీసీ బిడ్డనని చెప్పుకునే ప్రధాని మోదీ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు బీసీ కమిషన్‌కు చట్టబద్దత తేవడంతో..  సామాజికంగా, విద్యాపరంగా మేలు జరిగితే రాజకీయ, ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఓబీసీల దిక్సూచిగా నిలుస్తారని అంతా భావించారు. చారిత్రక అన్యాయాన్ని మనస్సులో ఉంచుకొని రూ పొందించే ఏ సానుకూల విధానమయినా ప్రభుత్వ తోడ్పాటు గరిష్ఠంగా అవసరమవుతుందని, అత్యంత వెనుకబడిన వర్గాల కు కులగణన సంరక్షణగా అభిప్రాయపడ్డారు.

బీసీల్లో అత్యంత దుర్భర స్థితిలో  ఉన్న వారిని ఆదుకోవాలనేది రాజ్యాంగ ఆదేశమనే విషయం తెలిసి కూడా మన ఓట్ల ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు సా మాజిక న్యాయం అందించడంలో చిత్తశుద్ధి కన్పించడంలేదు. బ్రిటీష్ కాలంలో 1931లో జరిగిన కులగణన ఆధారంగానే ఫలాలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం నిష్పాక్షిక నిర్ణయంతో జనాభాలో 56 శాతంగా వున్న వెనుకబడిన తరగతుల (బీసీలు) ఆకాంక్షలు సాకారం అవుతాయని భావించినప్పటికీ, ఇప్పటికీ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం శోచనీయం. 

అడ్డుపుల్లలే ఎక్కువగా 

సామాజిక న్యాయాన్ని సాధించడానికి నిష్పాక్షిక, పారదర్శక, జవాబుదారీ, ఏకరీతి విధానాన్ని రూపొందించేందుకు రే వంత్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలుకు తీసుకున్న 9వ షెడ్యూల్, ఆర్డినెన్స్ , 285 (ఏ) చట్ట సవరణ నిర్ణయాలకు కేంద్రంలో ని బీజేపీ అడ్డుపుల్లలు వేసిందనేది అందరికీ తెలిసిందే. నాడు కేంద్రం ప్రభుత్వం అగ్రవర్ణాలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి 50 శాతం అ డ్డంకి లేకుండా చట్టం చేసింది.

ఇదే అదను గా స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించిన కే సీఆర్ ప్రభుత్వం 2019లో జరిపిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థికం గా వెనుకబడిన పేదలకు ప్రైవేటు విద్యాసంస్థలు సహా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలు కు శ్రీకారం చుట్టింది. విద్య, ఉద్యోగం, ఉ పాధి అవకాశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు అమలవుతున్నాయి. కానీ అప్పుడు ఏ బీసీ సంఘం కూడా అడ్డుపడలేదు.

అయి తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పక్కదారి ప డుతున్నాయని మొత్తుకున్నట్టే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కొట్టివేయాలని కొంద రు మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సామాజికంగా, విద్యాపరంగా వెను కబాటుతనానికి వృత్తి దారితీస్తుందని, అ గ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా? సంపన్నులకు వర్తిస్తాయా? అం టూ మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వాస్తవానికి ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కేవలం అగ్రవర్ణాల్లో ఉన్న సంపన్నులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండి, అందులోని పేదలకు అన్యా యం జరుగుతోందని పిటిషనర్లు పేర్కొనడం గమనార్హం. సామాజిక వెనుకబాటు తనమనేది సంబంధిత వ్యక్తి వృత్తి స్వభావంపై, సమాజంలో దాని హోదాపై ఆధా రపడి ఉంటుంది. 

రిజర్వేషన్లలో భిన్న వైఖరి

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ బీసీల సమగ్రజీవన విధానం మార్పుకు అ న్ని రంగాల్లో ఆర్థిక పరిపుష్టితో పాటు రా జ్యాధికారం దక్కాలనే ఆకాంక్షతో కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి కులగణన చేసి, అమలుకోసం శాసనసభలో తీర్మానం చే శారు. కానీ బీసీల రిజర్వేషన్ల వ్యతిరేకులు పనిగట్టుకొని కోర్టు మెట్లు ఎక్కారు. సరిగ్గా 8 శాతం కూడా లేని సుప్రీంకోర్టుకు వెళ్లిన వంగ గోపాల్ రెడ్డి, హైకోర్టును ఆశ్రయించిన బుట్టేంగారి మాధవరెడ్డి ప్రవర్తన చూ స్తే వారి మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

56 శాతం ఉన్న బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అనేది స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే. విద్య, ఉద్యోగ రంగాల్లో ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లను కూడా పొందకుండా క్రిమీలే యర్ పేరుతో రిజర్వేషన్లు నోచుకోకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ అమల్లో భిన్న వైఖరి అవలంబిం చింది. అగ్రవర్ణాల్లో ఉన్న బెంజ్ కారు, బంజారాహిల్స్‌లో రెసిడెన్సీ గల అనర్హులు తమకు తాము సామాజికంగా వెనుకబడినవారమని చెప్పుకోవడంతో.. దారిద్య్ర రేఖ కింద ఉన్న అర్హులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయి.

అధికరణ 15(4), అధికరణ 16(4) రెండు సం దర్భాల్లోనూ ఇది వాస్తవమే అవుతుంది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సూచనలు పరిగణనలోకి తీసుకొని గణాంకాల ప్రాతిపదికన వెనుకబాటుతనాన్ని నిర్ణయించకపోవడం, అగ్రవర్ణ పేదలకు లేని రిజర్వేషన్ల పంచాయతీ అగ్రవర్ణాల్లోని సం పన్నులు బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్ర యత్నం తీవ్రమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిందన్న సంతోషం పక్కనబెట్టి హైకోర్టులో కొట్లాడేందుకు డెడికేషన్ కమిషన్ నివేదిక బలంగా నిరూపించాల్సిన అవసరముంది.

జడ్జిమెంట్ డే

వెనుకబాటుతనాన్ని నిర్ణయించడమనే ది సాపేక్షంగా ఉండకూడదని నాడు మం డల్  కమిషన్ కేసులో తొమ్మిది మంది స భ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినట్లుగానే.. ‘కులం ప్రాతిపదికతో పాటు వృత్తి - ఆదాయం ప్రాతిపదికన ఓబీసీలను గుర్తిం చి రాష్ర్టంలో రిజర్వేషన్లు అమలుకు ప్ర యత్నం ముమ్మరంగా జరిగింది. కానీ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలనే కుట్రల వెనుక అవే శక్తులు, అవే కుట్రలు స్వాతంత్య్రం వచ్చి 78ఏండ్లయినా తగ్గలేదు.

ఆర్టికల్ 32ను కూడా ఉపయోగించి అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కి చివాట్లు పడ్డారు. అత్యంత దుర్భర ప రిస్థితుల్లో కునారిల్లుతున్న సామాజిక వ ర్గాల వారిని కేసులతో రాజ్యాధికారానికి దూరం చేసే ప్రయత్నం కట్టప్ప రూపంలో రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10 శాతం పెం చడంలో అడ్డురాని నిబంధనలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమల్లో మా త్రం అ గ్రవర్ణాలు విరుద్ధంగా వ్యవహరించడం రా జ్యాంగ బాధ్యతను విస్మరించడ మే అవుతుంది.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బీసీ సంఘాలు, కాంగ్రెస్ నేతలు, ప్ర జాస్వామ్య వాదులు ఇంప్లీడ్ పిటిషన్లు వేశా రు. పిటిషనర్లు వాదించినట్టుగా ‘ఇంది రా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకే పరిమితం అ నేది మర్చిపోయి, రాజకీయ రిజర్వేషన్లపై రాజకీయాలు చేయడం ఏమిటో అ ర్థం కా వడం లేదు. శాసనసభ వేదికగా మ ద్దతు ఇచ్చిన అన్నిపార్టీలు వారి చిత్తశుద్ధిని చా టుకోవాలి.

ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం బర్ 9 నిలువదని వాదన చేస్తున్న బుద్ధిజీవులు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటనేది బీసీ సమాజం ప్రశ్నిస్తున్నది. సుప్రీం కోర్టు పిటిషన్లు హైకోర్టులో పెం డింగ్ లో ఉండగా అత్యున్నత న్యాయస్థానంలో ఎందుకు పిటిషన్ వేసారని, ప్ర శ్నించినంత మాత్రాన హైకోర్టులో గెలుస్తామని విర్రవీగితే మొదటికే మోసం వ స్తుం ది.

రిజర్వేషన్ వ్యతిరేకులను గుర్తించి, వె న్నుపోటు పొడిచిన పార్టీలను స్థానిక సం స్థల్లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం. అయితే జనాభాలో మే మెంతో మాకంత వాటా వస్తుందని నేటి ‘జడ్జిమెంట్ డే’ కో సం ఎదురుచూస్తున్న బీసీ సమాజానికి హైకోర్టు నుంచి తీపికబురు అందుతుంద ని ఆశిద్దాం.

 వ్యాసకర్త సెల్: -9866255355