calender_icon.png 13 October, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో...

13-10-2025 09:30:29 PM

- హోమియోపతి వైద్యం ఉత్తమం 

- కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల (విజయక్రాంతి): దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో హోమియోపతి వైద్యం మెరుగైందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ ఆయుష్ పథకం క్రింద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హోమియోపతి వైద్య శిబిరాన్ని డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనిత, వైద్య శిబిరం ఇంచార్జ్ డాక్టర్ స్పందనలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ వైద్య విధానం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో హోమియోపతి మెరుగైన వైద్య విధానమన్నారు.

ఆయుర్వేదం, యునాని, అల్లోపతి లాంటి అనేక ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని, మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో హోమియోపతి మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో కూడుకుందని, మందుల వినియోగం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.