calender_icon.png 13 October, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్లవ పోరాట యోధుడు

09-10-2025 12:00:00 AM

అతనో మడమ తిప్పని పోరాట యోధుడు. సాహసం అతని ఊపిరి. విప్లవ పోరాటంతో ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వీరుడు. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.. ఆయనే చేగువేరా. జూన్ 14, 1928న అర్జెంటీనాలోని రొసారియా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1953లో బ్యూ నస్ ఎయిర్స్ విశ్వవిద్యా ల యం నుంచి వైద్యశాస్త్రంలో పట్టాను పొందారు. అనంత రం మోటార్ సైకిల్‌పై దక్షిణ అమెరి కా ఖండమంతా కలియతిరిగి ప్రజల జీవనస్థితిగతులను అధ్యయనం చేశారు.

పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయవాదాన్ని బలంగా వ్యతిరేకించారు. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడుగా చలామణీ అయ్యారు. 1954లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వంతో కలసి పనిచేశారు. కానీ అదే ఏడాది అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూ లంగా ఆ ప్రభుత్వం పడిపోవడంతో చేగువేరా మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటన అతని హింసాత్మక విప్లవ దృక్పథాన్ని మరింత బలపరిచింది.

మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో క్యూబా విప్లవకారులతో చేతులు కలిపారు. 1950వ దశకం చివర్లో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటంలో (1956 చేగువేరా కీలకపాత్ర పోషించారు. డాక్టర్‌గా, మిలిటరీ క మాండర్‌గా సేవలందించా రు. ఈ సమయంలోనే ఇతను ‘చే’ గా పిలువబడ్డాడు. ఫిడెల్ కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చే పట్టినపుడు చేగువేరా పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు.

ఈ సందర్భంగా 1959 జూలైలో చేగువేరా భారతదేశంలో పర్యటించడం విశేషం. గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనల్లో వర్థమాన దే శాల్లో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మించాలని కోరుకున్నారు. పేద దేశాల్లో విప్లవాన్ని వ్యాప్తి చేయాలని భావించిన చేగువేరా 1965 లో క్యూబాలో తన ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలిపెట్టి కాస్ట్రో వారిస్తున్నా దేశం వి డిచి వెళ్లిపోయారు. చేగువేరా తన అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపారు.

ఆ సమయం లో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి చేగువేరా విఫలమయ్యారు. 1966లో దక్షిణ అమెరికాలోని బొలీవియాలో మిలటరీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించారు. అయితే 1967 అక్టోబర్ 9న పల్లెగ్రాండ్ అనే ప్రాం తంలో బొ లీవియా సైనికుల చేతుల్లో కాల్చి చంపబడ్డాడు. 39 ఏళ్ల వయసులోనే అ సువులు బాసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవ చిహ్నంగా మారాడు చేగువేరా. అతని జీవితం, ఆలోచనలు ఇప్పటికీ చాలా మందిని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. చేగువేరా ఇచ్చిన స్ఫూర్తితో యువత ముందుకెళ్లాల్సిన అవసరముంది

                                             కామిడి సతీష్, 9848445134