08-10-2025 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
సంధ్యాదీనామ్ అయథోద్దేశావస్థాపనమ్ అపనయః..
తస్మాదాపదః సంభవంతి.. (కౌటిలీయం - 9-5)
సంధి విగ్రహాది ఆరు గుణాలను (సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వుధైభావము, సమాశ్రయము) ఎప్పుడు, ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోవడం అపనయము (చెడు నీతి) అనబడుతుంది. దాని వల్ల ఆపదలు కలుగుతాయి, అంటాడు ఆచార్య చాణక్య. అనుకోకుండా కలిగే కష్టాలే ఆపదలు.
అవి నాలుగు రకాలు. బయటివారి కుట్రలను లోపలివారు బలపరచడం.. లోపలివారి కుట్రలను బయటివారు బలపరచడం.. బయటివారి కుట్రలను బయటివారే బలపరచడం, లోపలివారి కుట్రలను లోపలి వారే బలపరచడం.. బయటివారు అన గా.. దేశవాసులే అయినా అధికారంలో లేని ప్రముఖులు, ఇతరప్రాంతాలు లేదా విదేశాలవారు.. లోపలివారు అంటే రా జ్యంలోని వారు, బయటివారైనా, లోపలివారైనా లేనిపోని వదంతులు కల్పించి ప్ర ల మధ్య కలతలు, అలజడులు సృష్టించడమే ఆపదలు కలిగించడం.
మానవ జీ వన నిర్వహణ, రాజ్యపాలన సంపదతో ముడిపడి ఉంటుంది. సంపదను సృష్టించడం, పరిరక్షించడం, వృద్ధిచేయడం సా ధించిన అభ్యుదయాన్ని అరత ప్రాతిపదికగా ప్రజల కందించడం పాలకుల క ర్తవ్యం. సంపద సృష్టిలో వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యం, మానవ వనరులు కీలకం కాగా వాటిని ప్రభావవంతంగా ఉ పయోగించుకోవడం నాయకుని ప్రతిభకు గీటురాయిగా చెప్పుకోవాలి.
అన్ని రంగాల్లో శరవేగంగా
ఒకనాడు ఆత్మ విశ్వాసం కొరవడి ప్ర పంచాధిపత్యాన్ని అంగీకరిస్తూ, వారి అభిప్రాయాలకనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శకం నుంచి ఆత్మవిశ్వాసంతో, ప్రేరణాత్మకంగా, స్వయం నిర్ణయాలు తీ సుకునే స్థితికి ఎదిగిన భారతదేశం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నది. దేశ ప్రగతిని, నా యకత్వ సమర్ధతను చూసిన మదుపరులు పెట్టుబడులు పె ట్టేందుకు ముందుకు వస్తున్నారు. టాటా క్యాపిటల్, ఎల్‌జీ లాంటి పలు సంస్థలు.. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 బిలియన్ డాలర్ల పె ట్టుబడులు IPO (Intial Public Offering) ద్వారా సమకూర్చుకునేందు కు సన్నద్ధమయ్యాయి.
ప్రైైవేటు సంస్థ లు తమ షేర్లను మొదటిసారిగా ప్రజలకు విక్రయించి పబ్లిక్ కంపనీలుగా మారే ప్ర క్రియనే IPO అంటారు. ఇక భారత్‌లో 2025లోనే దాదాపు 11 సంస్థలు యూనికార్న్ (Unicorn) సంస్థలుగా రూపాంత రం చెందాయి. ఒక బిలియన్ డాలర్ల మై లురాయిని దాటి, లిస్టింగ్‌కు వెళ్లని స్టార్టప్ కంపెనీని యూనికార్న్ సంస్థగా గుర్తిస్తారు. అలాంటి సంస్థలు అమెరికాలో 1050, చైనాలో 240 ఉండగా.. భారత్‌లో 123 సంస్థలు ఉండడం అభివృద్ధి చెందిన దేశాలతో భారత ఆర్థిక వ్యవస్థ పోటీపడుతూ స్వయం సమృద్ధిగా ఎదుగుతున్న తీరుకు దర్పణంగా చెప్పవచ్చు.
ఆయా సంస్థల వి స్తరణల వల్ల.. దాదాపు 3 నుంచి 5 లక్షల మందికి ప్రత్యక్షంగా/ పరోక్షంగా ఉపాధి ల భిస్తుందని అంచనా. భారతదేశం డిజిటల్ మార్కెట్, ఇంటర్‌నెట్ వినియోగంలో, విమానయాన రంగంలో, ఆత్మవిశ్వాసంతో.. గణనీయమైన ఫలితాలు సాధిస్తూ వ్యూహాత్మకంగా ఎదుగుతున్నది. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలను, ఓడరేవులను అభివృద్ధిపరచడం ద్వారా పల్లెలు, పట్టణాల మధ్య సంబంధాలను దృఢతరం చేస్తూ అభ్యుదయాన్ని సాధిస్తున్నది. స్వదేశంలో సాధిస్తున్న అభివృద్ధిని ఆస్వాదిస్తూ, విదేశాల్లోనూ సగర్వంగా తలెత్తుకు తిరగ గ లుగుతున్న భారతదేశ వికాసాన్ని చూసి, అవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు వలసపోయిన భారత మేధ స్వదేశం వైపు చూడడం జరుగుతున్నది.
అసూయ, ఈర్ష్యలతో
ఒక దేశం స్వయం సమృద్ధిని సాధించి ఎదుగుతున్న దశలో సహజంగానే కొన్ని దేశాలు ఈర్ష్య, అసూయలతో దానిని కూ లద్రోయాలని కుట్రలు చేస్తుంటాయి. అ లాగే స్వదేశంలోనూ, విదేశాల్లోనూ తమ కు దక్కని గౌరవాదరణలు మ రొక నాయకునికి దక్కడం చూసి కొందరు నాయకులు అసూయచెందే అవకాశమూ ఉంటుంది. అ లాంటివారు ఆ నాయకుని గౌరవాన్ని త గ్గించే ప్రయత్నం చే స్తుంటారు.
ఆ క్రమంలోనే అమెరికా లాంటి అగ్ర రాజ్యం భారతదేశాన్ని పలువిధాలుగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. అలాగే పాకిస్థాన్ తన ఉగ్ర వాద కార్యకలాపాలతో భారత్‌లో అస్థిరత్వాన్ని, అశాంతిని సృష్టించేందుకై కుట్రలు పన్నుతూ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. దానికి సహకరిస్తూ విదేశాల్లోనూ, స్వదేశంలోనూ ఎందరో మే ధావులు, ఉగ్రవాద సంస్థలు వారివారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నా రు.
విద్యాలయాల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరణని స్తూ విదేశీ నిధులు సమకూర్చుకుంటూ దేశంలో మతాల మధ్య చిచ్చురేపుతూ, ప్రాంతీయ భేదాలను సృష్టిస్తూ కొందరు దేశాన్ని అస్థిరత పాలుచేయడానికి కృషి చే స్తూనే ఉన్నారు. దీనికి తోడు అభ్యుదయంలోనూ, విదేశీ వ్యవహారాల్లోనూ కలసి నడ వాల్సిన ప్రతిపక్ష నాయకులు విదేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చే స్తున్నారు. అసమర్ధ ప్రధాని నేతృత్వంలో భారత్ ప్రపంచానికి ఏనాడూ నాయకత్వం వహించలేదంటూ విదేశాల్లో స్వదేశాన్ని త క్కువ చేసి ఒక నాయకుడు చెబుతున్నాడు. దానిని సమర్ధిస్తూ జాతీయ భావనకు దూ రమైన నాయకులు ప్రసంగిస్తుంటారు.
ఉత్తమ ఫలితం
విదేశీ నిధులు స్వీకరించి, విదేశీయుల ప్రయోజనాలకై పాటుపడుతూ దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించే ప్రయత్నం చేసే మే ధావులు కొందరు. వారిని జైలులో పెడితే వారిని విడిపించేందుకై కృషిచేసే మేధావు లు మరికొందరు. వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలకై దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టేందుకై ప్రయత్నిస్తున్న నాయకులు మరికొందరు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం నడిచే దారి ప్రపంచప టంలో భారత స్థానాన్ని నిర్ణయిస్తుంది.
సమస్యలను సృష్టించే నాయకత్వం కన్నా.. చర్చల ద్వారా, సంయమనత ద్వారా, సమస్యల పరిష్కారానికి కృషిచేసే నాయకత్వ మే ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. స్వ ల్పకాలిక ప్రయోజనాలకై దీర్ఘకాలిక ప్ర యోజనాలను ఫణంగా పెట్టడం స్వార్థపర నాయకత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు.
చర్చల ద్వారా, పటిష్టమైన విదేశీ విధానం ద్వా రా, పరాక్రమం ద్వారా విదేశీ కుట్రలను, ప్రగతి ద్వారా స్వదేశీ కుట్రలను, సమర్ధవంతమైన చర్యలతో ఉగ్రవాదాన్ని అదుపు చే స్తూ నేడు భారతదేశ నాయకత్వం ఎప్పు డు, ఎక్కడ, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసి.. వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూ బయటి శక్తులకు, అంతర్గత శక్తులకు ఎదురొడ్డి ప్రజల శ్రేయస్సుకై పాటుపడడం చాలా అభినందనీయం.
వ్యాసకర్త సెల్: 9441666943