17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వ్యాయామం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం

16-06-2025 08:45 PM

వ్యాయామం శక్తిని పెంచుతుంది..

దశల వారిగా ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది..

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మంత్రి అనసూయ సీతక్క..

ములుగు (విజయక్రాంతి): క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఆందోళనలను నివారించవచ్చనీ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంటలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S.), గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... జిల్లా కేంద్రం లో రెండు ఓపెన్ జిమ్ సెంటర్లులు ఉన్నాయని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని,ఆత్మగౌరవాన్ని మెరుగుపరుస్తుందని, వ్యాయామం అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో, బరువు తగ్గకుండా ఉండటానికి సహాయపడుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు పొంది డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రతి మండలంలో ఒక జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలకు మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం జరిగినదని అన్నారు. ఇళ్ళు లేని నిరుపేదలు ఆందోళన చెందవద్దనీ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇంటి నిర్మాణం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల మంజూరు నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దశలవారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని మంత్రి అన్నారు.