22 May, 2026 | 7:35 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ఓటు హక్కును వినియోగించుకోవాలి

20-04-2024 01:22 AM

n కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని, వందశాతం పోలింగ్ నమోదు చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారు. కలెక్టరేట్ నుంచి ప్రధాన రోడ్డు మీదుగా భారీ ర్యాలీ తీశారు. మే 13న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొని ఓట్లు వేయలన్నారు. కలెక్టర్ ఎడ్ల బండితో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు వివి శాఖల అధికారులు పాల్గొన్నారు.