04-10-2025 09:17:27 PM
అసెంబ్లీ మీడియా అడ్వైజర్ కమిటీ సభ్యులు బుర్ర ఆంజనేయులు గౌడ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో పాత్రికేయులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా అడ్వైజర్ కమిటీ సభ్యులు బుర్ర ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఆయన స్వగ్రామం అయిన ఎలిగేడులోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న హనుమాన్ మార్కండేయ ఆలయంలో , రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శనివారం ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మానిస్తున్న ఆలయ నిర్మాణానికి ఆయన 10 వేల 116 రూపాయల చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ వెంగళ దాస్ రాజమౌళికి అందజేశారు. గ్రామంలోని పలువురు నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు, ఎలిగేడు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామంలో అతి పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణానికి అభివృద్ధికి కావలసిన నిధుల గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తా అని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆయన చిన్నతనంలో ఆడి పాడిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. మండల పరిధిలోని పాత్రికేయుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. మండల కేంద్రంలో ప్రెస్ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.