calender_icon.png 1 December, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

01-12-2025 10:19:07 PM

డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి 

గరిడేపల్లి (విజయక్రాంతి): ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోదాడ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. మండలంలోని పొనుగోడు గ్రామంలో సోమవారం రాత్రి ఎన్నికల నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న విషయాన్ని వివరిస్తూ కళాజాత బృందం కళాకారులతో ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.

నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు కఠినతరంగా ఉంటాయని ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని కోరారు. ప్రజలు ప్రలోభాలకు గురికా వద్దన్నారు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలను, అభ్యంతర కరమైన పోస్టులను పెట్టవద్దన్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు వివాదం కలిగించకుండా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హుజూర్నగర్ సిఐ చరమండరాజు, గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ ,పోలీస్ సిబ్బంది, పోలీస్ కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ, గురులింగం, సత్యంతో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.