calender_icon.png 1 December, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థిగా యువ నాయకుడు లంబ రమేష్ నామినేషన్

01-12-2025 10:36:21 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి లంబ రమేష్ యాదవ్ రెండో విడతలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను మండల సమీకృత కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో బరిలోకి దిగడం జరిగింది. గతంలో గ్రామ ప్రజలకు సేవలు అందించిన కుటుంబం అనుభవం కలిగిన యువ నాయకుడు కావడంతో మరో మారు గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని అవకాశం కల్పించారని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.